న్యూఢిల్లీ: హిందూత్వవాది స్వతంత్ర భరద్వాజ్‌కు మూడు వారాల మధ్యంతర బెయిల్ లభించింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసనలప్పుడు ఓ విద్యార్థిని తండ్రిపై చేసిన దాడి, వారి కుటుంబానికి వేధింపులకు సంబంధించిన వ్యవహారంలో దిల్లీ కోర్టు భరద్వాజ్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఆన్ కెమెరా ప్రోసిడింగ్స్ మంగళవారం జరిగాయని, అదనపు సెషన్స్ జడ్జి మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారని కోర్టు వర్గాలు తెలిపాయి. పూర్తి ఉత్తర్వులు వెలువడలేదన్నాయి. ఈనెల 7 నుంచి భరద్వాజ్ జ్యుడిషయల్ కస్టడీలో ఉన్నారు. విచారణను ఇన్-కెమెరా పద్ధతిలో నిర్వహించాలని న్యాయమూర్తి సోమవారం ఆదేశించారు. అయితే బెయిల్‌పై ఉత్తర్వులు ఈనెల 15న వెల్లడించనున్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా, భారద్వాజ్‌ను ఈనెల 4వ తేదీన బులంద్‌షహర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భరద్వాజ్ అరెస్టుకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల సీజేపీ నిరసన చేపట్టిన కొన్ని గంటలకే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.


