గురుగ్రామ్ : భారతదేశంలోని ప్రముఖ ప్రీమియం, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రదాత అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) శుక్రవారం 2025 ఎడిషన్ ‘హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్’ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారం ప్రస్తుత కస్టమర్లు తమ హ్యుందాయ్ వాహనాల సేవ కోసం ఉచిత చెక్-అప్, డిస్కౌంట్ కూపన్‌లను పొందే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కస్టమర్ కేంద్రీకృత కార్యక్రమం మొత్తం యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచనుంది. మొదటిసారి కొనుగోలు చేసేవారు లేదా తమ ప్రస్తుత వాహనాలను మార్పిడి చేసుకోవడంతో పాటుగా అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారిని కనెక్ట్ కావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక రోజు పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కస్టమర్ ఔట్రీచ్ కార్యక్రమం మార్చి 23, 2025, ఆదివారం నాడు జరగనుంది. మరెన్నో ఆఫర్లను ప్రకటించినట్లు హెచ్‌ఎంఐఎల్ హోల్-టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు.