న్యూయార్క్: మధ్యశ్రేణి, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నవంబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడిరచారు. అమెరికాకు అధికంగా ట్రక్కులను ఎగుమతి చేసే దేశాల్లో మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ టాప్ 5లో ఉన్నాయి. అమెరికాలో తయారు చేయని భారీ ట్రక్కులపై అక్టోబరు 1 నుంచి 25 శాతం సుంకం విధిస్తామని సెప్టెంబరు 25న ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని ట్రక్కు డ్రైవర్లకు ఆర్థిక భోరోసా ఇవ్వాల్సిన అవసరం దృష్ట్యా ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడిరచారు. సరఫరా గొలుసులకు విఘాతం కలుగుతుందని, వ్యయం పెరుగుతుందని అమెరికాకు చెందిన ప్రధాన ఆటోమేకర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సుంకాల అమలు ఆలశ్యమైంది.
1 నుంచి ట్రక్కులపై 25 శాతం సుంకం : ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


