Homeఅంతర్జాతీయంఅమెరికాకు పాక్‌ అరుదైన ఖనిజాలు

అమెరికాకు పాక్‌ అరుదైన ఖనిజాలు

- Advertisement -

తొలి బ్యాచ్‌ సరఫరా
షిప్‌మెంట్‌ కోసం అరేబియా సముద్రంలో పోర్టు

ఇస్లామాబాద్‌: అమెరికాతో చేసుకున్న కీలక ఒప్పందంలో భాగంగా తమ అరుదైన ఖనిజాలా తొలి బ్యాచ్‌ను ఆ దేశానికి పాకిస్థాన్‌ సరఫరా చేసింది. సెప్టెంబరులో అమెరికాకు చెందిన యూఎస్‌ స్ట్రాటజిక్‌ మెటల్స్‌ (యూఎస్‌ఎస్‌ఎం)తో 500 మిలియన్‌ డాలర్ల ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మొదటి కన్‌సైన్మెంట్‌ వెళ్లింది. ఆధునిక సాంకేతికతలకు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు, రక్షణ వ్యవస్థలకు అవసరమైన కీలక ఖనిజాల కోసం ఈ ఒప్పందం చేసుకుంది. పాకిస్థాన్‌లో ఖనిజ శుద్ధి, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటు కోసం పెట్టుబడి పెట్టేందుకు యూఎస్‌ఎస్‌ఎం ముందుకొచ్చింది. తాజా పరిణామం పాకిస్థాన్‌అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా ఆ సంస్థ సీఈఓ స్టెన్సీ డబ్ల్యూ హెస్టీ వెల్లడిరచారు. ఇది ఖనిజాల సరఫరా గొలుసులో సహకారానికి మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. ప్రపంచ ఖనిజాల మార్కెట్‌లో పాకిస్థాన్‌కు స్థానం కల్పించేందుకు ఇది దోహదమైందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌కు భారీగా ఆదాయం సమకూరగలదని, ఉపాధి కల్పన, సాంకేతికతలను ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదం కాగలదని తెలిపాయి. పాకిస్తాన్‌ ఉపయోగించని ఖనిజ నిల్వలు ఆరు ట్రిలియన్‌ డాలర్లు అంటే రూ.6 లక్షల కోట్లన్న అంచనా ఉంది. అరుదైన ఖనిజాల ఎగుమతితో అమెరికాకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత పెరుగుతుంది. ప్రపంచ ఖనిజాల మార్కెట్‌ను నియంత్రించే ఇతరులపై ఆధారం తగ్గించుకునే వీలు కలుగుతుంది. అయితే, ఈ ఒప్పందంపై ప్రతిపక్ష పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అభ్యంతరం తెలిపింది. అమెరికాతో రహస్య ఒప్పందాల పూర్తి వివరాలు విడుదల చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. యూఎస్‌ స్ట్రాటజిక్‌ మెటల్స్‌ సరుకు రవాణా, పాస్ని పోర్ట్‌ను అమెరికాకు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయనే వార్తా కథనాలను ప్రస్తావించింది. అనాలోచిత, ఏకపక్ష, రహస్య ఒప్పందాలు పాకిస్థాన్‌లోని అస్థిర పరిస్థితులను మరింతగా దిగజార్చుతాయని హెచ్చరించింది. మరోవైపు అరేబియన్‌ సముద్రంలోని పాస్ని పోర్టును అరుదైన భూ ఖనిజాలా సరఫరాను మరింత సులభం చేసేందుకుగాను వినియోగించేందుకు అమెరికాకు పాకిస్థాన్‌ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రతిపాదించింది. గదర్‌ నుంచి 70 మైళ్లు... పాకిస్థాన్‌ఇరాన్‌ సరిహద్దు నుంచి 100 మైళ్లు ఉండే ఈ పోర్టు కోస్తా పట్టణం పాస్నీలో ఉంది. ఇది అరుదైన ఖనిజాల సరఫరాకు కీలకం. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. తమ అరుదైన భూ ఖనిజాల నమూనాలను ట్రంప్‌కు చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకొచ్చింది. కాగా, భారత్‌`పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా ఆపిన తనకు నోబెల్‌ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో తాజా పరిణామాలకు, రెండు దేశాల మధ్య పెరిగిన సఖ్యతకు ప్రాధాన్యత ఏర్పడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు