న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ నెల 12-13 తేదీలలో దిల్లీలో భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. ఆ సమావే శానికి ముందు ఇద్దరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. భారత్ తమకు వ్యూహా త్మక భాగస్వామి అని, రెండుదేశాల మధ్య భద్రత, అంతరిక్షం, ఇంధనం, రవాణా, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అనేక రంగాలలో సహకారం విస్తరిస్తోందన్నారు. రెండుదేశాల నేతలు ద్వైపాక్షిక సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలకు పెద్దపీట వేయన్నుారని డిమిత్రి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, గల్ఫ్ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం వంటి విషయాలపైనా చర్చలు జరిపే అవకాశం ఉందన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ మధ్యవర్తిత్వం వహించడం తమకు అంగీకారమేనని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు తిరిగి ప్రారంభించడానికి అమెరికా చర్యలు తీసుకుంటోందన్నారు.


