2025`26లో రూ.90 కోట్ల రికార్డు ఖర్చు
కేంద్ర మంత్రుల ఇళ్ల మరమ్మతులపై ఆర్టీఐ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల అధికారిక నివాసాలు ఉండే దిల్లీ ల్యూటెన్స్ బంగ్లా జోన్ నిర్వహణ, మరమ్మతులు, పునరు ద్ధరణకు వార్షిక ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. 2025`26లో ఈ బంగళాలకు మరమ్మతుల కోసం రూ.92.35 కోట్లు ఖర్చైంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వెల్లడించింది. మోదీ హయాంలో అంటే 12 ఏళ్లలో మరమ్మతులు, నిర్వహణ వ్యయం రూ.547.68 కోట్లుగా తేలింది. 201415లో రూ.27.47 కోట్లు ఖర్చు కాగా ప్రస్తుతం ఈ వ్యయం మూడు రెట్లకుపైగా పెరిగింది. పీటీఐ కోరిన సమాచారానికి కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఇచ్చిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. 2014-15 నుంచి 2025-26 వరకు కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం సీపీడబ్ల్యూడీ ద్వారా మొత్తం రూ.547.68 కోట్లు ఖర్చు అయింది. 2014-15లో రూ.27.47 కోట్లు, 2015-16లో రూ.29.57 కోట్లు, 2016-17లో రూ.30.10 కోట్లు, 2017-18లో రూ.23.34 కోట్లు , 2018-19లో రూ.23.42 కోట్లు , 2019-20లో రూ.26.37 కోట్లు , 2020-21లో రూ.53.87 కోట్లు, 2021-22లో రూ.40.84 కోట్లు , 2022-23లో రూ.73.86 కోట్లు , 2023-24లో రూ.54.52 కోట్లు , 2024-25లో రూ.71.98 కోట్లు, 2025-26లో రూ.92.35 కోట్లు చొప్పున ఖర్చు అయినట్లు వెల్లడించింది. ల్యూటెన్స్ బంగ్లా జోన్లోని నిర్మాణాలు 80100 ఏళ్ల నాటివి కావడంతో వాటి నిర్వహణకు భారీగా ఖర్చవుతోందని అధికారులు వెల్లడించారు. 19121930 నాటి నిర్మాణాలు కాబట్టి ఈ భవనాల్లో తేమ, నీటి లీకేజీలు, చెదలు, పాత విద్యుత్ వ్యవస్థలు, ప్లంబింగ్ సమస్యలు తరచూ వస్తాయని, కొన్ని కొత్త నిర్మాణాల ఆధునికీకరణ వంటి వాటి కోసం అధికంగా ఖర్చు అయినట్లు తెలిపారు. పాత బంగళాలు కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మాంచాలని గతంలో ప్రతిపాదనలు చేశారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. పార్లమెంటు సభ్యులే కాకుండా సీనియర్ న్యాయమూర్తులు, సైనిక ఉన్నతాధికారులు తదితరులు ఈ ప్రాంతంలో నివాసముంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో 7072 మంది ఉంటారు. ఈ లెక్కన 2025-26లో ఖర్చైన రూ.92.35 కోట్లను పోలిస్తే ఒక్కొక్కరికి సుమారు రూ.1.2 కోట్లకు పైగా ఖర్చు అయింది. అయితే ప్రతి ఇంటి మరమ్మతుల వ్యయం ఒకేలా ఉండదని అధికారులు అన్నారు. కాగా, మంత్రులు కాని లోక్సభ, రాజ్యసభ ఎంపీల ఇళ్లు… కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల కార్యాలయాల కోసం వెచ్చించిన మొత్తం ఎంతో వివరాలు లేవు. కేంద్ర కేబినెట్ మంత్రి సహాయకుడు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి నివాసాల్లో తరచూ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు పాడవుతుంటాయి. విద్యుత్ పరికరాల మరమ్మతులు, ప్లంబింగ్ పనులు ఎక్కువగా జరుగుతాయి. టైల్స్ను క్రమంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2009 సెప్టెంబరులో ఆర్టీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం 2004 నుంచి 2009 వరకు ఎంపీలు, కేంద్ర మంత్రుల బంగళాల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.93.50 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. ఇదిలావుంటే ఎడ్విన్ ల్యూటెన్స్ పేరు మీద ఈ ప్రాంతానికి ల్యూటెన్స్ పేరొచ్చిందని పీటీఐకు చరిత్రకారిణి, ‘కన్నౌట్ ప్లేస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ న్యూఢిల్లీ’ రచయిత స్వప్నా లిడిల్ తెలిపారు. బ్రిటిష్ కాలంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ)కు చెందిన ఆర్కిటెకుట్లు ఇక్కడి అధికారిక బంగళాలు నిర్మించారన్నారు. నాడు అనేక నగరాల్లో సివిల్ లైన్స్ నిర్మాణాలు జరిగాయని, ఇక్కడా వాటిని పోలిన బంగళాలే ఉన్నాయని చెప్పారు. పాత పార్లమెంటు భవనం, నార్త`సౌత్ బ్లాకుల ఆర్కిటెక్స్ హారÒట్ బేకర్ నివసించిన కృష్ణ మేన్న మార్గ బంగళాలో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉంటున్నారని స్వప్నా లిడిల్ గుర్తుచేశారు.


