Homeక్రీడలు122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్‌లో జోస్ బట్లర్?

122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్‌లో జోస్ బట్లర్?

- Advertisement -

న్యూదిల్లీ: ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో నిలిచాడు. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్‌లో నమోదైంది. సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు. అంత ఎత్తు నుండి వేగంగా వస్తున్న బంతిని జోస్ బట్లర్ కళ్లప్పగించి గమనిస్తూ అద్భుత టైమింగ్‌తో క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ప్రశంసించాడు. ఇంతకుముందు 2021లో ఆస్ట్రేలియాకు చెందిన థిమోతి షానన్ జెబసీలన్ 119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు బట్లర్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అధికారిక ధృవీకరణ రావాల్సి ఉన్నప్పటికీ త్వరలోనే బట్లర్ పేరు గిన్నిస్ బుక్‌లో చేరే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ మ్యాచ్‌లలో బట్లర్ వరుసగా 26, 21 పరుగులు చేశాడు. మంచి ఆరంభం దక్కినా పెద్ద స్కోర్‌గా మార్చలేకపోయాడు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తర్వాతి మ్యాచ్ లను స్కాట్లాండ్, ఇటలీతో ఆడనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు