-వినియోగదారుల కోర్టుతీర్పు
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: నిర్లక్ష్యంగా శస్త్ర చికిత్స చేసి బాధితుడి కంటి చూపు కోల్పోవడానికి కారణమైన నాటి సింహపురి హాస్పిటల్, నేటిమెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి 61.62 లక్షలు జరిమానా విధిస్తూ బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పుఇచ్చారు.వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చెవూరు సురేష్ బాబు వృత్తిరీత్యా పంచాయతీ కార్యదర్శి. 2017 మే లో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగాఅతడిని పరీక్షించినఓ వైద్యుడు సైనసైటిస్ శస్త్ర చికిత్స చేసుకోవాలని సూచించగామే11న సెప్టో ప్లాస్టీ,మినీ ఎఫ్ఈఎస్ఎస్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.మే 12 నఎడమకంటికివాపువచ్చి ఎడమకంటిచూపుకోల్పోయాడు.తలకు సంబంధించిన పలు సమస్యలు కూడా తలెత్తాయి. అనంతరం చెన్నై అపోలో, బ్రెయిన్అండ్ స్పైన్ ఆసుపత్రు
ల్లో లెఫ్ట్ ఫ్రంటో-టెంపోరల్ క్రానియోటమీ, రాడికల్ ఎక్సిషన్, బయోప్సీ శస్త్ర చికిత్సలు చేసుకున్నాడు.
దీంతో బాధితుడు వినియోగదారులకోర్టునుఆశ్రయించాడు.ఆధారాలనుపరిశీలించినన్యాయమూర్తి రెడ్డి శేఖర్ సైనసైటిస్ ఆపరేషన్ అప్పుడు మెడికవర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాధితుడు పూర్తిగా కంటి చూపు కోల్పోయాడని, పలు సమస్యలు వచ్చాయని నిర్ధారించాడు. బాధితుడు
మెడికవర్, అపోలో, బ్రెయిన్ అండ్ స్పైన్ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు,మందులు, ఇతరఖర్చులకుగానూ21,62,752లు చెల్లించినట్లు బిల్లులు సమర్పించాడు. దీంతో ఖర్చు పెట్టిన రూ.21,62,752లు, శారీరక, మానసిక వేదన ఇతర డామేజస్కు గాను బాధితుడికి 40లక్షలుమొత్తం61,62,752లు నష్ట పరిహారం చెల్లించాలని బుధవారం నెల్లూరు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లావినియో గదారులకోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.45 రోజుల్లో పరిహారం చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీనుంచి 9 శాతం వడ్డీతో మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.తీర్పు కార్యక్రమంలో సభ్యురాలు బాలసుధ పాల్గొన్నారు.