విశాలాంధ్ర -పార్వతీపురం: గురువారం జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జిల్లాలోని 15మండలాలో 93.74శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో2వేల 333మంది ఉపాధ్యాయులకుగాను 2వేల 187మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఏ ఆర్ ఓ అయిన జిల్లా రెవెన్యూ అధికారి హేమలతలు తెలిపారు. వీరిలో 1469 మంది పురుషులు కాగా, 718 మంది మహిళలున్నారని తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో వీరఘట్టంమండలంలో 117/ 120మంది, సీతంపేట మండలంలో 116/ 121 మంది, భామిని మండలంలో 42/ 44మంది, పాలకొండ మండలంలో 243/ 301మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కురుపాం నియోజకవర్గంలో కొమరాడలో 63/ 65మంది, గుమ్మలక్ష్మీపురంలో 183/ 189మంది, కురుపాంలో 112/ 120మంది, జియ్యమ్మ వలసలో 78/ 91మంది, గరుగుబిల్లిలో 95/ 105మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలంలో591/ 636మంది, సీతానగరంలో 111/ 114మంది,బలిజిపేటలో 81/ 88మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో సాలూరులో 228/ 250మంది, మక్కువలో 55/ 55మంది, పాచిపెంటలో32/ 34మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో శతశాతం ఓటు హక్కును ముక్కులో వినియోగించుకోగా, తక్కువగా జిఎం వలస మండలంలో ( 85శాతం) నమోదయింది.ఎన్నికలకు సంబంధించి అన్నిఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పగడ్బందీగా చేపట్టిందని,15 మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అంతా సహకరించారని తెలిపారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి హేమలతలు పాల్గొన్నారు
జిల్లాలో 93.74 ఓటింగ్ నమోదు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటు హక్కును వినియోగించుకున్న 2వేల 187మంది ఓటర్లు
RELATED ARTICLES