Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాలిసెట్ లో 94.03 శాతము ఉత్తీర్ణత..

పాలిసెట్ లో 94.03 శాతము ఉత్తీర్ణత..

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లమహా ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ -2025 లో జిల్లాలో 94.03 శాతము ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాలురు 2704 మంది, బాలికలు 1,989 మొత్తము 4,693 మంది పరీక్షలు రాయగా 2,510 మంది బాలురు ఉత్తీర్ణత కాగా, 1,903 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. మొత్తం మీద బాలురు, బాలికలు 4,413 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. బాలురు 92.83 శాతము, బాలికలు 95.68 శాతం సాధించడం జరిగిందన్నారు. మొత్తం మీద జిల్లాలో 94.03 నమోదు కావడం జరిగిందన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ప్రిన్సిపాల్ సురేష్ బాబు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు