Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలి..

అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలి..

బహుజన సమాజ పార్టీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్ ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత 135 వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాకే వినయ్ , యసి, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు దాసగాని పల్లి కుళ్లాయప్ప రామ్ ప్రసాద్ మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసిద్ధి చెందారు అని తెలిపారు. రాజ్యాంగ రచనలో, అణగారిన వర్గాల సామాజిక మరియు ఆర్థిక సాధికారతకు దానిని శక్తివంతమైన సాధనంగా మార్చడంలో ఆయన కృషి ప్రశంసనీయం అని తెలిపారు.1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు అని, అదే సంవత్సరం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. 1953లో, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మరో గౌరవ డాక్టరేట్ కూడా పొందారు అని తెలిపారు.. అయన మన దేశ రాజ్యాగం రచించడం మన అందరి అదృష్టం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో బియస్సాపి నాయకులు ఓము సాకే హరి, యసి జనసంగం నాయకులు ధను, నిడిగాళ్ళు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు