విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక టిడిపి కార్యాలయంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శేషాద్రి నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, టీడీపీ యువ నాయకులు సతీష్ కుమార్, మహేష్, మేకల రంగ నాథ్, రాజుకుమార్, జనసేనా సీనియర్ నాయకులు సోమ శేఖర్ లు మాట్లాడుతూ సినీ, రాజకీయ, సేవా రంగంలో లెజెండ్ బాలకృష్ణ అని అన్నారు. దివంగత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్థాపించిన బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి బాలకృష్ణ తీసుకువెళ్లారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కైరుప్పల రామక్రిష్ణ, బాబు, క్రిష్ణ, యూత్ నాయకులు నాగేంద్ర, శేఖర్, రామంజీ, జనసేన నాయకుడు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.