Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్ఈరోజు యూరప్ పర్యటనకు సీఎం చంద్రబాబు...

ఈరోజు యూరప్ పర్యటనకు సీఎం చంద్రబాబు…

ఊపిరిసలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచెం రిలాక్స్ కాబోతున్నారు. ఈరోజు ఆయన యూరప్ పర్యటనకు వెళుతున్నారు. కాసేపట్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. రాత్రికి విజయవాడలో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆయన విందును ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళతారు. ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు బయల్దేరుతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకను అక్కడే ఘనంగా జరుపుకోబోతున్నారు. 22వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. 23న ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు