Monday, April 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివక్ఫ్ బోర్డు నూతన సవరణ చట్టాన్ని రద్దు చెయ్యాలి..

వక్ఫ్ బోర్డు నూతన సవరణ చట్టాన్ని రద్దు చెయ్యాలి..

ముస్లిం సోదరులకు మద్దతు పలికిన సిపిఐ పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; వక్పో బోర్డు నూతన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తో పాటు సిపిఐ పార్టీ నాయకులు పూర్తిగా మద్దతు పలికి ర్యాలీలో పాల్గొన్నారు.
అదేవిధంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎర్రంశెట్టి రమణ ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులు చేస్తున్న ర్యాలీ కి భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) గా మద్దతు తెలియజేస్తూ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇలాంటి నల్ల చట్టాలు ఎన్ని తెచ్చిన గాని తిప్పి కొట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, రజక సంఘం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమాఖ్య నాయకులు లింగమ్మ,లలితమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు