Tuesday, July 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాన్న ప్రేమను మరవకూడదు.. స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్

నాన్న ప్రేమను మరవకూడదు.. స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్

విశాలాంధ్ర ధర్మవరం;; నాన్న ప్రేమను ఎప్పుడూ కూడా మరవకూడదని బాధ్యతతో నడుచుకోవాలని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నాన్న దినోత్సవం (ఫాదర్స్ డే) సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాన్న ప్రేమను బాధ్యతలో చూడగలమని తల్లి జీవితాన్ని ఇస్తే, ఆ జీవితానికి దారి చూపేవారు ఒక్క నాన్న మాత్రమే అని తెలిపారు. కుటుంబంలో వచ్చే ఎంతటి కష్టానికి అయినా ముందుండి ఎదుర్కొనే సాహసశీలి అని తెలిపారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 15న ఫాదర్స్ డే ను జరుపుకుంటారని తెలిపారు. బిడ్డను కడుపులో మోషేది తల్లి అయితే, గుండెల మీద పెట్టుకొని జీవితాంతం మోషే వాడు, చూసేవాడు తండ్రి అని తెలిపారు. తండ్రి ప్రేమను పిల్లలకు వ్యక్తపరిచే విధానం పలు విధాలుగా ఉంటుందని తెలిపారు. కుటుంబములోని కూతురు పెళ్లి చేసుకుంటే తండ్రి ప్రేమ ఏంటో తెలుస్తుందని తెలిపారు. కుటుంబంలోని కూతురు ఎప్పుడూ కూడా నాన్ననే ఎక్కువగా ప్రేమిస్తారని తెలిపారు. నాన్నకు కష్టం వస్తే నాన్నతో పాటు కూతురు కూడా బాధపడుతుందని తెలిపారు. కష్టాలలో నాన్నకు కూతురు చేదోడు, వాదోడుగా ఉంటుందని తెలిపారు. కుటుంబములోని తన పిల్లలు తాను కోరుకున్న విధంగా మంచి వ్యక్తులుగా ఎదిగితే ఆ సంతృప్తి సంతోషం తండ్రి కళ్ళల్లో కనిపిస్తుంది అని తెలిపారు. తండ్రి కూతుళ్ళ బంధం ఎంతో అందమైనదని, ఆ ఇద్దరూ ఒకే లక్ష్యంతో నడుస్తూ ఒకరికొకరు ప్రేరణగా మారుతూ సామాజిక మార్పు కోసం కృషి చేస్తారని తెలిపారు. అన్నింట నాన్న ఉన్నాడు అన్న ధైర్యం కుటుంబంలో పిల్లలకు ఉంటుంది అని వారు స్పష్టం చేశారు. కుటుంబంలో నాన్న నేర్పిస్తాడు, పిల్లలతోపాటు తాను కూడా నేర్చుకుంటాడు అని తెలిపారు. కాబట్టే కుటుంబంలో ఉన్న పిల్లలు తాము తమకున్న దానిలో సంతోషపడుతూ, చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పుడే తండ్రికి అదే మంచి గిఫ్ట్ అవుతుందని తెలిపారు. జీవితానికి సుస్థిరబాట వేసిన నాన్న, భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించే కానుక అందించడం మేలు అవుతుందని తెలిపారు. కావున కుటుంబంలోని పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత, ప్రేమ, గౌరవం, బాధ్యత తో ఉంటూ వృద్ధాప్యంలో ఆదుకోవలసిన బాధ్యత ఆ కుటుంబంలోని పిల్లలదేనని వారు తెలిపారు. అనాధాశ్రమంలో తల్లిదండ్రులను ఎన్నడూ కూడా చేర్చరాదని, వృద్ధాప్యంలో వారి ప్రేమను కుటుంబంలోని పిల్లలు పొందినప్పుడే జీవితం సుఖమంతమవుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు