విజయవాడలో స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడికి వైసీపీ ముఠాలు దాడికి దిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్్ణలో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందని లోకేశ్ విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి టీచర్ ఉద్యోగాలు సాధించిన వారిని వైసీపీ అవమానిస్తోందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని లోకేశ్ తెలిపారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీచర్లపై దాడికి దిగారని ఆరోపించారు. రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను టీచర్లపైకి ఉసిగొల్పారని లోకేశ్ ఆరోపించారు. గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమని అన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలని సూచించారు.
టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మంత్రి లోకేశ్ వార్నింగ్
- Advertisement -


