విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పౌష్టికాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయకుమారి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం జరిగింది. ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయకుమారి మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే గర్భిణులు, బాలింతలకు రోగనిరోధక శక్తి లభిస్తుందన్నారు. ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. పౌష్టికాహారం ప్రాధాన్యతను గర్భిణులకు, బాలింతలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుకన్యమ్మ, చిట్టెమ్మ, జయమ్మ, అయ్యమ్మ, థెరీసమ్మ, ఆదిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.