విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామంలో చెడిపోయిన చేతిపంపుకు గ్రామ సర్పంచ్ హ ఆధ్వర్యంలో మెకానిక్ పౌలయ్య మంగళవారం మరమ్మతులు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడమే తన ధ్యేయం అన్నారు. ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేస్తానని సర్పంచ్ హనుమంతు స్పష్టం చేశారు.