విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలో ఉన్న విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పది ఫలితాలలో సత్తా చాటారు. బుధవారం వెలువడిన పది ఫలితాలలో విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రణవి 577, రామకృష్ణ 577, కార్తికేయ 575, రామాంజనేయులు 567 ఉత్తమ మార్కులు సాధించి మండల ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి మండల టాపర్లుగా నిలిచినట్లు కరస్పాండెంట్ మల్లేష్, హెచ్ఎం ధనలక్ష్మి లు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలకు విజేత హైస్కూల్ నిదర్శనం అన్నారు. ముగ్గురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలవడం చాల సంతోషంగా ఉందన్నారు. 500 కు పైగా 21 మంది విద్యార్థులు, 400కు పైగా 24 మంది విద్యార్థులు మార్కులు సాధించారన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించి మండల టాపరులుగా నిలవడం గర్వంగా ఉందన్నారు. మొత్తంగా 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగ ఆరు గురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. మా విజేత హై స్కూల్ 91% ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. టీచర్లు నాణ్యమైన విద్య బోధన, తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి చక్రపాణికి 554 మార్కులు, జొహరాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థి యోగి కి 540 మార్కులు, కస్తూరిబా పాఠశాల విద్యార్థిని అశ్వినికి 549 మార్కులు, ములుగుందం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వసంత కుమార్కు 429 మార్కులు సాధించి ఆయా హై స్కూల్ లలో టాపర్లుగా నిలిచారు. అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు.