Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జమ్ముకశ్మీరులో భీకర ఎన్‌కౌంటరు

ఆర్మీ అధికారి, నలుగురు జవాన్ల మృతి

పూంచ్‌ : జమ్ముకశ్మీరులోని పూంచ్‌ జిల్లాలో సోమవారం భారీ ఎన్‌కౌంటరు జరిగింది. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. అందులో జూనియర్‌ కమిషన్డు ఆఫీసర్‌(జేసీఓ) ఉన్నారు. టెర్రరిస్టుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. పూంచ్‌ జిల్లా సురాన్‌కోట్‌ ప్రాంతంలో కొంతమంది వాస్తవాధీన రేఖ దాటి చమ్రేర్‌ అటవీ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లి గాలింపు చేపట్టారు. దీనిని గమనించిన ఉగ్రవాదులు భద్రతాసిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జూనియర్‌ కమిషన్డు అధికారి, మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఉగ్రవాదులు నక్కిన అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. కొద్దిమంది ఉగ్రవాదులు అడవిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img