Homeతెలంగాణచేతివృత్తులను ప్రోత్సహించండి

చేతివృత్తులను ప్రోత్సహించండి

- Advertisement -


విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణ బోనాల ఉత్సవాలు సంధర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 29 వరకు అంటే ఐదు రోజులు చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువుల ప్రదర్శన… విక్రయం టాంక్‌ బండ్‌ సమీపంలో నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టిపాత్రలు, ‘నిరా’ స్టాల్‌, వెదురు వస్తువులు, హ్యాండ్‌ లూమ్స్‌ (పోచంపల్లి ఇక్కత్‌, గద్వాల్‌, నారాయణపేట్‌) పూసలవారి సామగ్రి, తెలంగాణ వంటకాలు, చేప వంటకాలు, భోజన స్టాల్స్‌ ప్రదర్శించబడతాయని వివరించారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 09.30 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రజలు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వస్తువులు కొనుగోలు చేసి చేతివృత్తులవారిని ప్రొత్సహించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు