విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం ప్రభుత్వ ఐటిఐ లో ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రంలో వెబ్ డెవలపర్ కంప్యూటర్ కోర్స్ మరియు సోలార్ పీవీ ఇన్స్టాలర్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు. ఈ ఉచిత శిక్షణకు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆధార్ కార్డు, 10 వ తరగతి సర్టిఫికెట్ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తేదీ. 10-05-2025 లోపు రాజాం ప్రభుత్వ ఐటిఐను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7286042743, 8121450657 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ బి.భాస్కరరావు తెలిపారు.