Tuesday, May 6, 2025
Homeఆంధ్రప్రదేశ్నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ద్రోణి ప్రభావం, వాతావరణ అనిశ్చితి కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక విశాఖపట్నం, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు, నిన్న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు, వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు