Tuesday, May 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధంకండి

అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధంకండి

బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి సవాల్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ పై హరీష్ బాబు పై చేసిన ఆరోపణలపై బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, జింక చంద్రశేఖర్, సాకే ఓబులేష్, గొట్లూరు చంద్రతోపాటు మరో 20 మంది నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ఎన్డీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యకలాపాలకు గూర్చి తెలియజేస్తూ, ఎవరు నిజాయితీపరులు? ఎవరు కారు? అన్న విషయాలు ప్రజలకు తెలుసునని తెలిపారు. వాస్తవాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిందలు మోపడం సరికాదు అని వారు హితో పలికారు. అవినీతి కార్యకలాపాలపై తాము సిద్ధము అని, ఈనెల 10వ తేదీన జరిగే చెన్నకేశవ స్వామి రథోత్సవం దగ్గరకు ప్రమాణానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారా అని వారు సవాల్ విసిరారు. అక్కడే నిజాలను చర్చిద్దామని ఎవరు అవినీతిపరులో? ఎవరు అభివృద్ధికి అడ్డుకాలు వేస్తున్నారు? అనేది ప్రజలే చెబుతారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఆ అభివృద్ధిని ఓర్వలేకనే వైఎస్ఆర్సిపి నాయకులు నిందలు వేయడం సరైన పద్ధతి కాదు అని, అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ పేరిటన, ప్రజలకు ఏమి చేశాడో? ప్రజలకు, మోసపోయిన వ్యక్తులకు తెలుసునని, రాజకీయాలకు అతీతంగా ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ విశేష కృషి చేస్తున్నారని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో మన నియోజకవర్గానికి గల నిధులను తేవడంలో ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగుల విషయంలో ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించి, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. పెన్షన్, రోడ్లు, వీధి దీపాలు, నీటి కొరత లేకుండా చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీకి ఇప్పటికే నిధులు తేవడం జరిగిందని, ఆ నిధులతో ధర్మవరం అభివృద్ధి తప్పక జరుగుతుందని తెలిపారు. ఇకనైనా వైసీపీ నాయకులు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, లేనియెడల ప్రజలే నీకు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు