Tuesday, May 13, 2025
Homeజాతీయంమార్కెట్లకు భారీ షాక్! 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

మార్కెట్లకు భారీ షాక్! 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

సోమవారం భారీ లాభాల తర్వాత మంగళవారం మార్కెట్ల పతనం
సోమవారం నాటి రికార్డు స్థాయి లాభాల జోరుకు మంగళవారం బ్రేకులు పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. నాలుగేళ్లలో అత్యుత్తమ సెషన్‌ను సోమవారం నమోదు చేసిన భారత ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో మాత్రం భారీగా నష్టపోయాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 898.83 పాయింట్లు (1.09%) నష్టపోయి 81,531.07 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.50 పాయింట్లు (0.90%) క్షీణించి 24,699.20 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా (1.11% అప్), బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, మిగిలిన షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఎటర్నల్ (జొమాటో) (2.46% డౌన్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో కూడా ఇన్ఫోసిస్ (2.42% డౌన్), ఎటర్నల్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్‌టెక్, పవర్ గ్రిడ్ షేర్లు ఎక్కువగా నష్టపోగా, బీఈఎల్ (3.86% అప్), డాక్టర్ రెడ్డీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఫార్మా సూచీ 1.98 శాతం, హెల్త్‌కేర్ సూచీ 1.72 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.88 శాతం చొప్పున లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు, నిఫ్టీ ఐటీ సూచీ 1.13 శాతం నష్టంతో టాప్ డ్రాగర్‌గా ఉంది. దీని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.58% డౌన్), బ్యాంక్ నిఫ్టీ (0.37% డౌన్) సూచీలు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

స్విగ్గీ, కెఫిన్ టెక్ షేర్ల పతనం
మరోవైపు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ షేర్లు మంగళవారం 7.3 శాతం మేర కుప్పకూలి, బీఎస్ఈలో రూ. 297 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరాయి. ప్రీ-ఐపీవో నాన్-ప్రమోటర్ ఇన్వెస్టర్లకు ఆరు నెలల తప్పనిసరి లాక్-ఇన్ పీరియడ్ మే 12న ముగియడమే ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది. జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ ప్రకారం బలహీనమైన క్యూ4 ఫలితాలు, లాక్-ఇన్ పిరియడ్ గడువు ముగింపు ప్రభావంతో స్విగ్గీ షేర్లు సమీప భవిష్యత్తులో ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు కూడా ఇంట్రాడే ట్రేడ్‌లో దాదాపు 7 శాతం పతనమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు బ్లాక్ డీల్స్ ద్వారా కంపెనీ ఈక్విటీలో 10 శాతం చేతులు మారడమే దీనికి కారణం. ఈ షేరు ఒక దశలో 6.97 శాతం తగ్గి రూ. 1,040 కనిష్టాన్ని తాకింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు