Tuesday, May 13, 2025
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది. షోపియాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కాల్పులు జరిపారు.

ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకుని ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారిని ఉగ్రవాదులను పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు