Tuesday, May 13, 2025
Homeఆంధ్రప్రదేశ్వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మ‌ళ్లీ నిరాశేఎదురైంది. ఆయ‌న‌ రిమాండ్‌ను న్యాయ‌స్థానం మ‌రోసారి పొడిగించింది. రేప‌టి వరకు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజుతో రిమాండ్ ముగియ‌నుండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం వంశీ రిమాండ్‌ను రేప‌టి వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు మ‌ళ్లీ విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు.

ఇక‌, ఇదే కేసులో వంశీతో సహా మిగిలిన న‌లుగురు నిందితులు గంటా వీర్రాజు, శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, నిమ్మ చ‌ల‌ప‌తి, వేల్పూర్ వంశీబాబుల రిమాండ్ కూడా ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. వారి రిమాండ్‌ను కూడా న్యాయ‌స్థానం రేప‌టి వ‌ర‌కు పొడిగించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు