ఇంచార్జ్ సూపర్డెంట్ హరి శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: అనురాగమూర్తి సేవకు స్ఫూర్తి నర్సులేనని ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జ్ సూపర్డెంట్ హరి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి, ఆసుపత్రిలోని నర్సులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరి శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు రోగులకు సేవలు చేయడంలో, వారి ఆరోగ్యమును పదిలంగా కాపాడుటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారని తెలిపారు. సెలవులు లేకుండా తీవ్రమైన ఒత్తిడి ఉన్నా కూడా, నర్సుల సేవలు మరువరానివని తెలిపారు. పని భారం పెరిగినా కూడా తమ విధులలో భాగంగా తమ వృత్తిని సేవా భావంతో నిర్వర్తించడం దైవ సేవతో సమానమని తెలిపారు. ఆసుపత్రికి వెళ్ళగానే అమ్మలాంటి ఓ ఆత్మీయ పలకరింపు కేవలం నర్సులకే దక్కుతుందని తెలిపారు రు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఓ స్నేహితురాలుగా, కష్టములో భాగస్వామ్యగా మారే సోదరి, వైద్యులకు పిలిచి సేవలందించేందుకు సహకరించే వారు నర్సులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్స్ సూపర్డెంట్ రమాదేవి, హెడ్ నర్స్ లత, సిబ్బంది సునీత, ప్రవల్లిక, హరిత, రాధా, పద్మ తదితరులు పాల్గొన్నారు.
అనురాగమూర్తి సేవకు స్ఫూర్తి నర్సులే..
RELATED ARTICLES