Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియశోద పాఠశాలలో ఉచిత కోచింగ్ ..

యశోద పాఠశాలలో ఉచిత కోచింగ్ ..

యశోద పాఠశాల కరస్పాండెంట్ పృద్వి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట కాలనీ వద్దగల యశోద పాఠశాల యందు యువతి యువకుల కొరకు ఉచిత కోచింగ్ను నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ పృథ్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి. యాదగిరి, ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ హైదరాబాద్ వారిచే యువతీ, యువకులకు శిక్షణ ఇవ్వబడును అని తెలిపారు. 11వ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, కెరియర్ కౌన్సిలింగ్, జీవన నైపుణ్యాల , పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడించడం, నిర్దిష్టమైన జీవిత లక్ష్యం , దాన్ని సాధించే మార్గం,వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలపై బోధన ఉంటుందన్నారు. పోటీ పరీక్షల యొక్క సిలబస్, తయారీ విధానం, వాటిని ఛేదించే మార్గం, వ్యాపారాలు ,స్టార్టప్స్ ఏర్పాటు చేయడం, కంపీరింగ్, డిబేట్, బృంద చర్చలు, ఇంటర్వ్యూలపై తర్ఫీదు ఉంటుందన్నారు. కోర్సు కాలవ్యవధి : 21 రోజులు ఉంటుంది అని, అర్హత: డిగ్రీ చదువుతున్న లేదాపూర్తి చేసిన వారు, పీజీ ,బీటెక్, తదితర ప్రతి సెంటర్లో 100 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ఉచిత స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజనం, దూర ప్రాంతాలనుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి ఉంటుందన్నారు.తరగతులు ఈనెల 16వ తేదీ నుండి ఉదయం 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత కోచింగ్ ఇవ్వబడును అని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు