విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వహించినఏపీ ఈసెట్ 2025 పరీక్ష ఫలితాలను గురువారం వీసీ ఛాంబర్ లో సెట్ చైర్మన్ ఉపకులపతి ఆచార్య సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య, కన్వీనర్ ఆచార్య దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ,ఆచార్య భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి బీటెక్ రెండవ సంవత్సరం ప్రవేశాలు ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,187 మంది రిజిస్టర్ చేసుకోగా, 34,228 మంది పరీక్షకు హాజరయ్యారు. 31, 922 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 93.26 గా ఉందని తెలిపారు. పరీక్ష ఫలితాలను ఏపీ ఈసెట్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
01.. పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న వీసి, కన్వీనర్