విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని చిగిచేర్ల ఉన్నత పాఠశాలలో 10 వతరగతి చదువుతున్న యామిని జాతీయ సాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 5 వరకూ నెల్లూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉమ్మడి అంతఃపురం జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాదించడం లో కీలక పాత్ర పోషించి, రైట్ ఇన్ లో ఆడి టాప్ గొల్ స్కోరర్ గా నిలిచి రాష్ట్ర సెలెటర్ల దృష్టిని ఆకర్షించి అండర్ 17 ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టు కు జాతీయ స్థాయి హాకీ పోటీలలో ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందడం జరిగిందన్నారు. జాతీయ స్థాయి పోటీలు నవంబర్ 22 నుంచి 27 వరకు హర్యానాలో జరుగుతాయి అని తెలిపారు. యామిని 6 వ తరగతి నుంచే ప్రతిరోజూ హాకీ సాధన చేస్తూ హాకీ లో అన్ని మెలుకువలు నేర్చుకొని, గత సంవత్సరం కూడా అండర్ 14 స్కూల్ గేమ్స్ హాకీ పోటీలలో కూడా జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిందన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఐన యామిని ని పాఠశాల హెడ్ మాస్టర్ , ఫిజికల్ డైరెక్టర్, ఉపాధ్యాయులు,గ్రామస్తులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ వారు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ స్థాయి హాకి పోటీలకు చిగిచర్ల పాఠశాల విద్యార్థి
RELATED ARTICLES