Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా వివిధ హోమాల వేడుకలు..

ఘనంగా వివిధ హోమాల వేడుకలు..

- Advertisement -

శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరములో మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఈనెల రెండవ తేదీ నుండి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మూడవరోజు అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రత్యేక పూజలు, నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం సాయంత్రం దీక్షా హోమము, మృత్యుంజయ, నవగ్రహ, మూల మంత్ర, ధన్వంతరి, ఆదివాస హోమాలు సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ దంపతులు స్వయంగా పూజలు నిర్వహించారు.తిరిగి సాయంత్రం జపములు ,శైయాదివాసం, పుష్పాదివాసం ,అష్టావధాన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగాయి. దేవాలయమును విద్యుత్ దీప అలంకరణలతోనూ, మామిడాకులు అరటి తోరణాలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ వారు వీరనారాయణ, రామలింగయ్య ,సూర్య ప్రకాష్ ,రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ వేడుకలు ఐదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రధాన పురోహితులు వేదమూర్తి బ్రహ్మశ్రీ పంచాంగం నాగ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఐదవ తేదీన నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్లు కూడా వేడుకలో పాల్గొంటారని తెలిపారు. షిరిడి సాయినాథ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన జరిగి 25 సంవత్సరములు జరిగిన శుభ సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ఈ మూడు రోజుల్లో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, త్రిపుర సుందరీ దేవి సమేత చంద్రమౌళీశ్వర స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపములు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు