Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపోతుకుంట గ్రామంలో మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

పోతుకుంట గ్రామంలో మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

- Advertisement -

రూరల్ సీఐ ప్రభాకర్
విశాలాంధ్ర – ధర్మవరం;; జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకుమహిళల భద్రత, సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతుకుంట గ్రామంలో ధర్మవరం రూరల్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజశేఖర్ ,పోలీసు సిబ్బంది మహిళల భద్రతపై అవగాహన ర్యాలీతో పాటు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామస్తులు, మహిళలు, యువతతో సి ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధం, మహిళల చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో 112, శక్తి యాప్ వంటి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
మహిళల పట్ల ఎలాంటి వేధింపులు, అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలో మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు ,ధర్మవరం రూరల్ ఎస్సై రాజశేఖర్ , పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు