విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కే పి టి వీధిలో గల పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 119 సంవత్సరాలుగా దేశ ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందిస్తున్నామని తెలిపారు. మా బ్యాంకులో సేవింగ్స్ బ్యాంకు, పిఎం జనధన్, మైనర్ సేవింగ్స్, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు చేయుట, ప్రభుత్వ పథకాల ఉపయోగమును వివరించుట, గోల్డ్ లోన్ నెలవారి వడ్డీ రేటు 75 పైసల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. కస్టమర్ యొక్క బంగారానికి మరింత విలువలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శిక్షణ డిపాజిట్ పై అత్యధిక వడ్డీగా 6.85 శాతము ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిఎస్పీ హోమ్ లోన్స్, డి.ఎస్.పి వెహికల్ లోన్స్, పిఎస్బి విద్యా రుణం, కిషన్ క్రెడిట్ కార్డు తదితర వాటికి తాము ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోండి.. మేనేజర్
- Advertisement -
RELATED ARTICLES


