వన్ టౌన్ సీఐ రెడ్డప్ప, టూ టౌన్ సిఐ జయ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ ప్రాంతంలోని విద్యార్థులు, యువతీ యువకులు మత్తుపదార్థాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని వన్టౌన్ సీఐ రెడ్డప్ప, టూ టౌన్ సీఐ జయ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ టూ టౌన్ పరిధిలో గల పాఠశాలలకు, కళాశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాలు వినియోగం వల్ల కలిగే అనర్థాలు గూర్చి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని వారు తెలిపారు. కావున యువతి యువకులు గాని విద్యార్థులు గాని తమ భవిష్యత్తుపై దృష్టి సారించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు.


