Homeజిల్లాలుశ్రీ సత్యసాయియూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం ఛలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం ఛలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగే టెట్ రద్దు కోసం చలో విజయవాడ పోస్టర్లను యుటిఎఫ్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ మరియు జిల్లా కార్యదర్శి పి అమర్ నారాయణరెడ్డి , రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన టెట్ నిర్వహిస్తామని సంఘాలు డిమాండ్ చేస్తే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ అందులో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు అని ఉంది కానీ సాధారణ టెట్కు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్కు ఏ మాత్రం తేడా లేదని ఉపాధ్యాయుల ఆకాంక్ష మేరకు మార్కులు తగ్గించలేదని ఆఫ్లైన్లో కూడా నిర్వహించడం లేదని తెలియజేశారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పదోన్నతుల కొరకు నిర్వహించే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ మాదిరిగా క్వాలిఫై మార్క్స్ కమ్యూనిటీ వారీగా కాకుండా అందరికీ ఒకేలా 40 శాతం ఉండాలని డిమాండ్ చేశారు.విద్యాహక్కు చట్టం సెక్షన్ 23 (1) సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షలలో అర్హత మార్కులు తగ్గించాలి అని ఉపాధ్యాయుల కోరిక మేరకు పరీక్ష ఆఫ్లైన్లో నిర్వహించాలి అని తెలిపారు.
ఉపాధ్యాయులకు వారు బోధిస్తున్న సబ్జెక్టులలో మాత్రమే పరీక్ష నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. పై డిమాండ్స్ తో సెప్టెంబర్ మూడవ తేదీ గురువారం విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం కోసం ధర్మవరం జోన్ నందలి నాయకులు కార్యకర్తలు హాజరై జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం డివిజన్ నాయకులు జింక హరికృష్ణ, రామాంజనేయులు, ఆంజనేయులు, వెంకట కిషోర్, నాగిరెడ్డి ,రవి శేఖర్, పూజారి రామకృష్ణ ఆదిశేషయ్య, సాయి గణేష్, గోపాల్ రావు ,శివారెడ్డి తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు