ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర – ధర్మవరం;; ఎస్ ఐ ఆర్ యొక్క ఎనిమినేషన్ ఫారములు బిఎల్ఓ లకు అందజేసేలా పార్టీ శ్రేణులు శ్రద్ధ వహించాలని ధర్మవరం రెవెన్యూ డివిజన్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ
ఎస్ఐఆర్ కు మరో 5రోజులు మాత్రమే గడువు ఉందని,ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్ లు బిఎల్ఓ లకు అందజేయాలని పార్టీ శ్రేణులు చొరవ తీసుకోవాలని తెలిపారు. తదుపరి కార్యాలయం నుంచి ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణులతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్ లు ఎవరెవరు అందజేయలేదన్నది బిఎల్ఏలు ఇంటింటా పెళ్లి మరోసారి పరిశీలించాలన్నారు. మ్యాపింగ్ కాని ఓట్లు, చనిపోయిన ఓట్లు, డబల్ ఓట్లు, డూప్లికేట్ , షిఫ్టింగ్ ఓట్ల వివరాలు పోలింగ్ బూత్ ల వారిగా బిఎల్ఏలు అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి ఇంకా మిగిలి ఉన్న వారితో ఎన్యూమరేషన్ ఫామ్ లు ఇప్పించేలా చూడాలని ఆదేశించారు. అదే విధంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 18సంవత్సరాల వయసు ఉన్న వారిని కొత్త ఓటర్లుగా చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. బిఎల్ఏ లు ఈ 5రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ మరోసారి డోర్ టు డోర్ వెళ్లాలని సూచించారు. క్లస్టర్, యూనిట్, మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులు దీనిని పర్యవేక్షించాలని తెలిపారు.
ఎన్యుమరేషన్ ఫామ్ లు బిఎల్ఓలకు అందజేసేలా చూడండి
- Advertisement -
RELATED ARTICLES


