విశాలాంధ్ర – ధర్మవరం;; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో నేత్రదాత సుబ్బ లక్ష్మమ్మ వెలుగులు నింపింది. వివరాలకు వెళితే పట్టణంలోని మార్కెట్ వీధి కి చెందిన రేపాకుల సుబ్బలక్ష్మమ్మ వయస్సు 79 అనారోగ్యం తో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డి.వై.కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి.రాఘవేంద్ర గారు కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు రేపాకుల సూరి సుధాకర్, కిషోర్, అశోక్, కుమార్తె రేణిగుంట్ల శ్రీదేవికు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సీలా నాగేంద్ర, డాక్టర్ సుబ్బారావు, గర్రె రమేష్ బాబు, మాజీ కౌన్సిల్ మెంబర్ కేతా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత సుబ్బ లక్ష్మమ్మ
- Advertisement -
RELATED ARTICLES


