Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచంద్రప్పన్ సినిమాను విజయవంతం చేయండి

చంద్రప్పన్ సినిమాను విజయవంతం చేయండి

- Advertisement -

దర్శక నిర్మాత డాక్టర్ యస్మన్

విశాలాంధ్ర – ధర్మవరం;; జులై 24 వ తేదీన విడుదల కానున్న చంద్రప్పన్ సినిమాను విజయవంతం చేయాలని దర్శక నిర్మాత డాక్టర్ యస్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సినిమా చిత్ర యూనిట్ లో నటీనటులు పాల్గొన్నారు అని తెలిపారు. తమ సొంత సంస్థ అయినటువంటి ఎలిగెంట్ ఎంటర్ టైస్మెంట్స్ నుండి చంద్రప్పన్ (రామసముద్రవాసి) అనే సినిమాకు కథ, కథనం, మాటలు, దర్శకత్వం, పాటలు తానే అందిస్తూ తన ప్రధాన పాత్రధారిగా ఉంటూ సినిమాను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాలి, ఇతర తారాగణం లో బలగం సంజయ్ కృష్ణ, వంశీ, అప్పాజీ, అంబరీష, భద్రం, రోషిని, రజాక్, సీత, మహాలక్ష్మి, అబాస్ టీవీ డాక్టర్ హరిప్రసాద్, మారుతి, మహిత, చందు, హరీష్ కాకుండా రాయలసీమ నుండి దాదాపు 300 మంది దాకా ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. మ్యూజిక్ మహావీర్, కెమెరా కర్ణ, ఎడిటింగ్ ఓ మస్తా స్టూడియోస్ ఉండడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా మదనపల్లి నేపథ్యంలో తెరకు ఎక్కించడం జరిగిందన్నారు. జులై 24వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రమును సకుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు