కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ప్రతిభ తారలు పురస్కారాలకు పట్టణంలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కు అరుదైన గౌరవం దక్కిందని ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా లోని ప్రభుత్వ , కేజీబీవీ, మోడల్ స్కూల్ , ప్రైవేట్ కలశాల లకు చెందిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసారు అని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 మంది ఈ అవార్డుకు ఎంపీక అయ్యరు అని,ధర్మవరానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రతిభ అవార్డుకి ఎంపీక కాగ వీరంతా శ్రీ వాసవి జూనియర్ కళాశాలకు చెందిన వారు కావడం గమనార్హం అని తెలిపారు. . వీరిలో ఓపెన్ క్యాటగిరిలో లో ఎం. చరణ్ తేజ్ రెడ్డి (ఎంపీసీ-990) , బీసీ కేటగిరీలో లో రాచుర్ శ్రావ్యలక్ష్మి (ఎంపీసీ-990) , పిక్కిలి దీపిక ( బైపీసీ-989),వెల్పుల సుమలత(సీఈ సీ-981) , ఎస్సీ కేటగిరీలో లో సాకే దీక్షిత(ఎంపీసీ-984), ఎస్ టి కేటగిరీలో కుమావత్ రుచితా బాయి(సీఈసీ సి-974), మైనారిటీ క్యాటగిరిలో షేక్ ఫర్జానా (ఎం ఇ సి-967), సి డబ్ల్యూ ఎస్ ఎన్ కేటగిరిలో గంగులకుంట మన్విత ( సీఈసీలో-927) లను ఎంపిక చేయడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అవార్డుకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ చిట్రా ఈశ్వరయ్య ,భాస్కర్ రెడ్డి అధ్యాపక బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
వాసవి కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రతిభ పురస్కారాలు
- Advertisement -
RELATED ARTICLES


