ఎంఈఓ లు రాజేశ్వరి దేవి ,గోపాల్ నాయక్.
విశాలాంధ్ర ధర్మవరం:; వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమమును నిర్వహించడం జరుగుతోందని ఎంఈఓలు..రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి, వాళ్లను పాఠశాలలో చేర్పించాలి అని ఈ సర్వే ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఒక వికలాంగ విద్యార్థిని ని గుర్తించడం జరిగిందని, ఈ అమ్మాయిని పాఠశాలలో చేర్పించాలని తెలియజెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాధ్యాయులు సరస్వతి ,మల్లికార్జున తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమం నిర్వహణ..
RELATED ARTICLES