హైదరాబాద్ : నగరంలోని చార్మినార్ పరిధిలో తీవ్రవిషాదం నెలకొంది. చార్మినార్కు దగ్గరలో గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతిచెందారు. ఊపిరి ఆడక స్పృహ కోల్పోయినవారిని యశోద, ఉస్మానియా, ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిసర ప్రాంతాల్లో పొగ ఎక్కువగా కమ్ముకోవడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించాలని సి.ఎం. ఆదేశించారు. ఈ ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నారా చంద్రబాబు నాయడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రులు హరీష్రావు, కేటీఆర్, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.