Monday, May 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత రంగంలో ప్రగతి..ఉచిత వైద్య సేవలులో పురోగతి

చేనేత రంగంలో ప్రగతి..ఉచిత వైద్య సేవలులో పురోగతి

చేనేత ప్రముఖులు డి. వి. వెంకటేష్ (చిట్టీ )
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి ఒకవైపు ధర్మవరం చేనేత రంగంలో బిజీగా వుంటూ మరోవైపు సేవా భావం లో రికార్డులు సృష్టించిన ధర్మవరం పట్టణానికి చెందిన పుర ప్రముఖులు డి. వి. వెంకటేష్ (చిట్టీ ) ఒకరు. ఆయన ధర్మవరం శ్రీ శాంతకళ చౌడేశ్వరి దేవి దేవాలయం తరుపున ప్రతి నెల ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ద్వారా ఇప్పటికి 110 వైద్య శిబిరాలు నిర్వహించి, సేవలు అందిస్తున్నారు. 33 వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు చేశారు. వారికి నెలకు సరిపడా మందులు ఉచితంగా అందజేశారు.తమ కుమారుడు డాక్టర్ డి. వి. జై దీపు నేత, వైద్య వృత్తి లో వున్నందుకు గాను ఈ సేవలు అందిస్తున్నామని, వారు తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరాలు ఇప్పటి వరకూ 110 వరకూ నిర్వహించడం జరిగింది అని,.అంతే గాకుండా సామాజిక సేవా కార్యక్రమం కింద తమ తండ్రి దాసరి పెద్ద వెంకటేశు జ్ఞాపకార్థం ప్రతినెలా 150 మంది కి రూ 200 చొప్పున గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ అందజేస్తున్నా మనీ తెలిపారు.ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో సంభందం లేకుండా అందరికీ ఉచితంగా పెన్షన్ అందజేయడం పట్ల డి. వి. వెంకటేష్ నేత ను పలువురు స్థానికులు అభినందిస్తున్నారు. తన తల్లి తండ్రులు దాసరి కేశమ్మ, దాసరి పెద్ద వెంకటేశులు స్ఫూర్తి తో సేవా భావం ఉండాలి కాని ఎలాంటి హద్దులు లేవని నిరూపించారు. డి. వి. వెంకటేశు (చిట్టీ )ధర్మవరం లో ధర్మశీ ఉందని మరోసారి నిరూపించారు. వీరు వీరికి పలువురు నేతన్నలు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు