విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కృష్ణాపురం ఆఫ్సర్ కు తన సామాజిక సేవ కు గుర్తింపుగా అంతర్జాతీయ మనం బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేస్తూ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆయనకు ప్రశంస పత్రాన్ని అందించారు. అవార్డు గ్రహీత కృష్ణాపురం ఆఫ్సర్ మాట్లాడుతూ తను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించానని , మనం ఫౌండేషన్ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా బ్లడ్ ఆర్గనేషన్ గ్రూప్ ఏర్పాటుచేసి గత కొన్ని సంవత్సరాలుగా తాను చేస్తున్న సేవను గుర్తించి అంతర్జాతీయ మనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు గ్లోబల్ పీస్ ఇంటర్నేషనల్ అవార్డు 2025 లో తన పేరు నమోదు చేసినందుకు అంతర్జాతీయ మనం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తికు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే తన సేవకు పలు అంతర్జాతీయ అవార్డులు తొ పాటు డాక్టరేట్ అవార్డులను సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవార్డు గ్రహీతకు పట్టణంలోని పలువురు సామాజిక సేవ ఆర్గనేషన్ వ్యవస్థాపకులు పట్టణ ప్రముఖులు తదితరులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక సేవకు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధర్మవరం వాసి
- Advertisement -
RELATED ARTICLES


