Monday, May 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి..

గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి..

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కురుబ కళ్యాణ మండపం వెనుక భాగాన మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య గల మగ వ్యక్తి బెంగళూరు- ధర్మవరం రైల్వే ఎక్స్ప్రెస్ కింద పడి మృతి చెందాడు అని హిందూపురం రైల్వే పోలీస్ ఎర్రి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతిని వద్ద పరిశీలించగా ఎటువంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి దృఢమైన శరీరము, చామన చాయ రంగు ,తెలుపు, నలుపు వెంట్రుకలు రంగు వేసినట్లుగా ఉన్నదని తెలిపారు. మృతుని ముఖము చిడ్రమైపోయినది అని తెలిపారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. మృతుడు పాచి కలర్ చెక్స్ డిజైన్ ఆఫ్ ఆఫ్ షర్ట్, బ్లూ ప్యాంట్ రెడీమేడ్ ఫుల్ డ్రాయర్ కలిగి ఉన్నాడని తెలిపారు. కనుక శవము మృతుని గుర్తింపు తెలిసిన వారు హిందూపురం రైల్వే పోలీస్ మొబైల్ నెంబర్ 9441238182 కు తెలియజేయాలి తెలిపారు. మృతుడు ధర్మవరం పట్టణము గాని చుట్టుపక్కల గ్రామ వ్యక్తిగా ఉండవచ్చునని హిందూపురం రైల్వే పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు