విశాలాంధ్ర ధర్మవరం;; హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురైన వారి పట్ల ప్రేమతో కూడిన సంఘీభావం తెలపాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై కేతన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిడ్స్ స్టాండిల్ లైట్ మెమోరియల్ దినోత్సవం పురస్కరించుకొని చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ సంఘీభావం తెలియపరిచేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం
“అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ దినోత్సవ” ర్యాలీ ను పట్టణ పురవీధులలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం ‘మే’ నెల మూడవ ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మేము గుర్తించుకుంటాం,మేము మాట్లాడతాం,
మేము నడిపిస్తాం అని తెలిపారు. కావున వీరందరికీ మనము సంఘీభావం తెలియజేస్తూ,వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దాం…అని తెలియజేసారు. అదేవిధంగా హెచ్.ఐ.వి సోకి మరణించిన వారిని స్మరించుకొని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ లైట్ డే ను నిర్వహించామని తెలియజేసారు.ఈ సందర్బంగా హెచ్.ఐ.వి సోకిన వ్యక్తులను వివక్షకు గురిచేయరాదని తెలియజేసారు.
ఏదో ఒక రోజు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధికి నివారణ నివారణ/ నియంత్రణ వస్తుందని అదే విధముగా ఈ వ్యాధి సోకిన వారు ఎవరైనా సరే దృఢంగా ఉండాలని ఆశిస్తూ… హెచ్.ఐ.వి. పాజిటివ్ వ్యక్తుల పట్ల , హెచ్.ఐ.వి. విభాగంలో పనిచేయు ఉద్యోగుల పట్ల వివక్షత చూపకుండా ఉండాలని తెలిపారు. మా విన్నపము. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాలేజీ సర్కిల్ వరకు కొవ్వొత్తుల తో ర్యాలీ నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలోమెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక ఐ సి టి సి కౌన్సెలర్ వనమాల, ల్యాబ్ టెక్నీషియన్ భార్గవి ,టిబియూనిట్ బాషా, శక్తి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణమ్మ, వైద్య వైద్య సిబ్బంది ,యువర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి గురైన వారిపట్ల ప్రేమా సంఘీభావం తెలపాలి..
RELATED ARTICLES