Tuesday, January 28, 2025
Homeజిల్లాలుఅనంతపురంశకుంతలమ్మ పార్థివ దేహానికి సిపిఐ ఘన నివాళులు

శకుంతలమ్మ పార్థివ దేహానికి సిపిఐ ఘన నివాళులు

నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకురాలు సిపిఐ

జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర అనంతపురం : కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ మృతి మహిళా సమాఖ్య కార్మిక ఉద్యమానికి తీరని లోటు, నిబద్ధత కలిగిన నాయకురాలు అని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. బుధవారం కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ పార్థివ దేహానికి సిపిఐ నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతపురం సంగమేష్ నగర్ ఆమె నివాసం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శకుంతలమ్మ భర్త ఋషేంద్ర బాబు, కుమారడు రాజేష్, కుమార్తె హిమబిందు సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో అనంతపురం వైద్య పరిశోధన నిమిత్తం ఆమె దేహాన్ని అనంతపురం మెడికల్ కాలేజీ అందచేశారు.
ఈ సంద్భంగా అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు, ఏఐటియుసి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ గౌరవ అధ్యక్షులు గా వివిధ బాధ్యతల్లో పనిచేసిన కామ్రేడ్ శకుంతలమ్మ మంగళవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నామన్నారు. గత 40 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం, పార్టీలో వివిధ బాధ్యతలు తీసుకొని నిర్విరామంగా అలుపెరుగని పోరాటం చేసిన, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకురాలు శకుంతలమ్మ భౌతికంగా ప్రస్తుతం మన మధ్య లేరన్నారు. కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించే శకుంతలమ్మ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినా పేద ప్రజల పట్ల ఆప్యాయత చూపించేవారు అని పేర్కొన్నారు. మహిళా ఉద్యమాల్లో హుందాగా వ్యవహరించడం ఆమె నైజం అన్నారు. పార్టీ అభివృద్ధి,విస్తరణ గురించి తపన పడేవారన్నారు. కామ్రేడ్ శకుంతలమ్మ మరణం మహిళా సమాఖ్య,కార్మిక ఉద్యమానికి తీరని లోటన్నారు. శకుంతలమ్మ మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా సమితి తరఫున తెలియజేస్తున్నామన్నారు. ఆమె బ్రతికున్నంత కాలం సమాజం కోసం సేవ చేశారన్నారు . మరణించిన తర్వాత శకుంతలమ్మ పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినందులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, సంజీవులు, సీనియర్ నాయకులు అమినమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, శ్రీరాములు,రమణ, బద్రి స్వామి, కేశవరెడ్డి, సంతోష్ కుమార్, రాజేష్, సిపిఐ నాయకులు అలిపిర నారాయణస్వామి, సుందరాజు, మల్లికార్జున, కృష్ణుడు మున్న గందిలింగప్పా జమీర్ ఏఐటీయూసీ రాజు, ఏఐవైఎఫ్ నాయకులు మోహన్ కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు