Tuesday, December 10, 2024
Homeజిల్లాలుఅనకాపల్లిఇసరపువాని చెరువు కబ్జా

ఇసరపువాని చెరువు కబ్జా

మట్టితో కప్పేసి నిర్మాణాలకు యత్నం

  • చోద్యం చూస్తున్న అధికారులు
  • పెదముషిడివాడలో ఆగని అక్రమాలు
    విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా)బీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాలు గడిచినా పరవాడ మండలం పెదముషిడివాడలో కబ్జాదారులకు, అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా జరిగిన అక్రమాలు కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వారంరోజలుగా సర్వేనెంబర్‌ 114లో ఇసరపువాని చెరువు కబ్జాకు గురవుతోంది. కొందరు అక్రమార్కులు చెరువును మట్టితో కప్పేసి నిర్మాణాలు జరిపేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా 5.53 ఎకరాల విస్థీర్ణం గల ఈ ఇసరపువాని చెరువు మద్యలో నుంచి పరవాడ – అసకపల్లి ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి కారణంగా చెరువు రెండు భాగాలు అయిపోయింది. పడమట దిశలో సుమారు 3.50 ఎకరాలు, తూర్పు దిశలో సుమారు రెండెకరాలుగా ఈ చెరువు విడిపోయింది. అయితే తూర్పు వైపున ఉన్న రెండెకరాల పక్కన ఓ వెంచర్‌ ఉండటం, పైగా దానికి ప్రధాన రహదారి కూడా కలిసి రావడంతో ఈ పంచాయితీలో అక్రమ దందాలు నడిపిస్తున్న కొందరి వైసీపీ నాయకుల కళ్లు ఈ చెరువు స్థలంపై పడ్డాయి. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఆ అక్రమార్కులు నాలుగేళ్ల క్రితం ఈ రెండెకరాల స్థలాన్ని ఆక్రమించి అందులో కొంత విస్థీర్ణాన్ని ప్లాట్లు లెక్కన విక్రయించేసారు. రిజిస్ట్రేషన్‌ స్టాంపు పేపర్ల మీద అగ్రిమెంట్‌ చేసి ఏకంగా చెరువు స్థలాన్నే అమ్మేసారు. ఇందులో స్థలాలను కొనుక్కున్న వ్యక్తుల్లో ఒకరిద్దరు గతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు కూటమి నేతలను మచ్చిక చేసుకుని తిరిగి చెరువును చెరపట్టేందుకు పావులు కదిపారు. రెవెన్యూ అధికారులూ కొత్తవారే కావడంతో వారిని కూడా లోబరుచుకుని వారం రోజల క్రితం అక్రమార్కులు రాత్రికి రాత్రే చెరువు కొంత భాగాన్ని మట్టితో కప్పేసారు. అందులో నిర్మాణాలు జరిపేందుకు నిర్మాణ సామగ్రి (రాయి)ని కూడా రెడీగా ఉంచారు. ఇంత బహిరంగాంగానే చెరువు స్థలం కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరో పక్క ప్రస్తుత రెవెన్యూ అధికారుల్లో కూడా ఇంకా వైసీపీ వాసన వదిలినట్లు కనిపించలేదు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట పడ్డం లేదనే చెప్పాలి. అయితే ఈ చెరువు కబ్జాపై ఆర్వో పృధ్విని విశాలాంధ్ర ప్రతినిధి వివరణ కోరగా కబ్జా విషయం తమ ధృష్టికి వచ్చిందన్నారు. తహశీల్ధారు అంబేద్కర్‌ ధృష్టికి తీసుకెళ్లి ఆయన ఆధేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వీఆర్వో చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు