Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరక్తదాన శిబిరమునకు విశేష స్పందన

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సంజయ్ నగర్ లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని కీర్తిశేషులు బీరే ఎర్రన్న కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా తండ్రి బీరే ఎర్రన్న నాలుగవ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరమును నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది దాకా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం తర్వాత అందరికీ పండ్లు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం భోజన ఏర్పాట్లు కూడా తాము నిర్వహించామని తెలిపారు. ఈ బ్రెడ్ క్యాంప్ ను విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు