Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిగ్గు తెల్చాలి..

మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిగ్గు తెల్చాలి..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; గత సంవత్సరం నిర్వహించడం మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిరసన చేస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ను పట్టణంలో నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తదుపరి ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పేరుతో మోసం చేసి ఉద్యోగాలను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాను పెంచడం రెండు శాతం నుండి మూడు శాతం పెంచుతూ జీవో ను విడుదల చేయడం కూడా జరిగిందన్నారు. మొత్తం మీద వ్యవహారంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వారు చేయబట్టారు. మెగా డీఎస్సీ ప్రశ్నాపత్రాలను అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం అవినీతి కాదా అని వారు నిలదీశారు. డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా వైఎస్ఆర్సిపి బయట పెట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని వారు తెలిపారు. కావున ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వాడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం, వైయస్సార్ విద్యార్థి విభాగం మున్సిపల్ విభాగం పట్టణ ధర్మవరం బత్తలపల్లి ముదిగుబ్బ తాడిమర్రి రూరల్ మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు